పాత కక్షల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలైన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆకునూరు దళితవాడకు చెందిన దగాని మధు ఉయ్యూరు, గుడివాడ ప్రాంతాలలో బొప్పకాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటాడు. అయితే ఇదే దళితవాడకు చెందిన వీరాబత్తిన ఆంటోనీ, వీరాబత్తిన అనిల్, ఆంటోనీ భార్య అయిన జోజి, ఆంటోనీ కుమార్తె (పేరు తెలియదు) అను వారు తనను అడ్డగించి ఇష్టం వచ్చినట్లు తిట్టి ఆంటోనీ, అనిల్ లు రాయితో తల పగలగొట్టినారని పేర్కొంటూ ఉయ్యూరు రూరల్ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దగాని మధు చేసిన ఫిర్యాదు మేరకు వీరాబత్తిన ఆంటోనీ, వీరాబత్తిన అనిల్, ఆంటోనీ భార్య అయిన జోజి, ఆంటోనీ కుమార్తెలఫై కేసు నమోదు చేశారు.