దేశంలో పరిస్థితులు బాగోలేవని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... దేశంలో రోజు రూ.60 కోట్ల మంది ఆకలితో నిద్రపోతున్నారని ప్రపంచ ఆహార సంస్థ గణాంకాలు చెపుతున్నాయని తెలిపారు. దేశంలోని ఆస్తులన్నీ బీజేపీ అప్పనంగా ఆదానికి కట్టబెడుతోందని ఆరోపించారు. దేశంలోని అన్ని వర్గాలని అణచివేస్తూ కార్పోరేట్ శక్తులకు ప్రోత్సాహిస్తోందని మండిపడ్డారు. బీజేపీలో సరైన నాయకులు లేరన్నారు. ఏపీలో విద్యా ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోయాయని... సీఎం జగన్ విద్యావ్యవస్థని బ్రష్టు పట్టించారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి రాష్ట్రం, దేశం కోసం ఏం త్యాగం చేశారని మెడికల్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారని మాజీ కేంద్ర మంత్రి ప్రశ్నించారు.