ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి వైఎస్సార్ పేరు మార్పు పై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ధర్నా చౌక్‌లో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అదే పేరును కొనసాగించాలన్నారు. వైఎస్సార్ పేరు పెట్టుకోవాలంటే కొత్త హాస్పిటల్స్ కట్టి పేరు పెట్టుకోమని సూచించారు. 1986లో ప్రజలకి వైద్యం అందించే దిశగా స్వర్గీయ ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ‘‘జగన్ చెల్లెలు షర్మిల స్వయంగా పాదయాత్రలో పేరు మార్పుపై ఖండించారు. తన చెల్లెలికి ఉన్న ఇంగిత జ్ఞానం కూడా సైకో జగన్ కి లేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టే వరకూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పోరాడుతాం. అమరావతి రాజధాని రైతులకు అడుగడుగునా నీరాజనాలు పట్టడం జగన్ తట్టుకోలేకపోతున్నాడు. అందుకే పిచ్చి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. జగన్ పతనం ప్రారంభమైంది’’ అని పేర్కొన్నారు