ప్రొద్దుటూరు స్థానిక రామేశ్వరంలోని పోతినేని చెన్నయ్య, నాగమ్మ స్మారక పురపాలక ఉన్నత పాఠ శాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు శనివారం ఉదయం చల్లా రాజుగోపాల్ తండ్రి రామయ్య జ్ఞాపకార్ధంగా సీమాంద్ర బి. సి. సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ చల్లా రాజగోపాల్ యాదవ్ రూ. 7 వేలు విలువైన నోటు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా చైతన్య సాంఘిక సేవా సంఘం అధ్యక్షులు కరుమూరు వెంకటరమణయ్య మాట్లాడుతూ విద్యార్థులు దాతలు, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకొని ఉన్నతంగా చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీమాంద్ర బి. సి. సంక్షేమ సంఘం నాయకులు బి. శ్రీనివాసులు, యం. రామచంద్రరాజు, దొంతు రామయ్య గౌడ్, కొర్రపాడు భాస్కర్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యబాబు, జోషప్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.