దళిత ప్రజల సమస్యల పట్ల పరిష్కారం కోసం పోరాట భాగంలో విముక్తి చిరుతల కక్షి వీసీకే పార్టీ ఆధ్వర్యంలో 26న నిర్వహించాల్సిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం వాయిదా వేశారు. శనివారం అనంతపురంలో విలేకరుల సమావేశంలో ఇందుకు గల కారణాలను వీసీకే జిల్లా అధ్యక్షులు మందల రమేశ్ వెల్లడించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు తిరుమవళవన్ త్వరలో అనంతపురం జిల్లాకు వస్తున్నారు అని అందుకు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామన్నారు.