ఇటలీ ఎన్నికల్లో జార్జియా మెలోని విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అదే జరిగితే ఆ దేశానికి ఆమె తొలి మహిళా ప్రధానమంత్రి కాబోతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో అత్యంత మితవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని మెలోని తెలిపారు. "ఈ దేశాన్ని పాలించే శక్తిని ఇస్తే, ఇటాలియన్లు అందరినీ ఏకం చేస్తానని ఆమె చెప్పారు. ఆదివారం ఇటలీలో ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ మెలోనిపై మొగ్గు చూపుతున్నాయి.