ఏపీలోని కృష్ణా జిల్లా కృత్తివెన్ను పంచాయతీలో విషాద ఘటన జరిగింది. కొండూరి నాగబాబు (48) పౌరోహిత్యం చేసుకుంటాడు. పీతలోవ అనే గ్రామంలో శనివారం ఆయన పామును పట్టుకున్నాడు. అయితే అది రెండు సార్లు ఆయనను కాటేసింది. అయినప్పటికీ జాలి పడి దానిని జనసంచారం లేని చోట వదిలేశాడు. పాము కాటుకు మంత్రం వేసుకుని, ఆ తర్వాత హాస్పిటల్కు వెళ్లాడు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయాడు.