మహిళా, శిశు సంక్షేమశాఖపై తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ మోహనరెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషాశ్రీచరణ్, స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, మహిళా, శిశుసంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్. అనురాధ, మార్క్ఫెడ్ కమిషనర్ పీఎస్. ప్రద్యుమ్న, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎ. సిరి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.