ఏపీ సీఎం జగన్ దివ్యాంగుల సంక్షేమంతో పాటు తదితర అంశాలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. దివ్యాంగుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక భవిత సెంటర్ ను అప్‌గ్రేడ్ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దివ్యాంగులకు అవసరమైన సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక జువైనల్ హోమ్స్ పర్యవేక్షణకు ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించాలని, సౌకర్యాల కల్పనపై దృష్టిపెట్టాలన్నారు.