ఏపీ సీఎం జగన్ అంగన్వాడీల నిర్వహణపై సమీక్ష జరిపారు. అంగన్వాడీలకు కూడా ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్‌లు ఏర్పాటు చేయాలని, పరిశుభ్రత కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. టాయిలెట్ల మరమ్మతు పనులు చేపట్టాలని, పిల్లలకు ఇప్పటినుంచే భాష, ఉచ్ఛారణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. పీపీ-1, పీపీ-2 పిల్లలకు పాఠ్యప్రణాళిక అమలు చేయాలని, అన్నీ బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్ ఉండాలన్నారు.