భారత మహిళల క్రికెట్ జట్టు లండన్ పర్యటనలో జరిగిన చేదు అనుభవాన్ని క్రీడాకారిణి తనియా సప్నా భాటియా నెట్టింట పంచుకుంది. 'లండన్లోని మారియట్ హోటల్ లోని నా వ్యక్తిగత గదిలోకి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. నగదు, కార్డులు, గడియారాలు, ఆభరణాలు ఉన్న నా బ్యాగన్ను దొంగిలించారు. దీనిపై త్వరితగతిన విచారణ జరిపి పరిష్కారం చూపాలని కోరుతున్నాను' అని ట్వీట్ చేసింది.