ఒంగోలు: విజయవాడ రైల్వే స్టేషన్ లో సిగ్నలింగ్ ఆధునీకరణ పనులు జరుగుతున్నందున ఈనెల 28 వరకు చీరాల, ఒంగోలు మీదుగా వెళ్లే అన్ని విశాఖ-తిరుపతి, చెన్నై-విశాఖ ఎక్స్ ప్రెస్ రైళ్లతో పాటు, 50 రైళ్ళను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం దేవేందర్ యాదవ్ తెలిపారు. సంతమాగులూరు, వినుకొండ, గిద్దలూరు మీదుగా వెళ్లే ప్రశాంతి-యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ రైలును కూడా నిలిపివేశారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు.