తూర్పు గోదావరి జిల్లా టీడీపీ ఇన్చార్జి బండారు సత్యనారాయణమూర్తి, ఆ పార్టీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని మాజీ మంత్రి కన్నబాబు హెచ్చరించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనే టీడీపీని రాష్ట్ర ప్రజలు బంగాళాఖాతంలోకి విసిరేశారని గుర్తుచేశారు. టీడీపీ అధికారంలో ఉండగా కుట్రపూరితంగా విజయవాడ కంట్రోల్ రూమ్ సెంటర్లోని దివంగత మహానేత వైయస్ఆర్ విగ్రహాన్ని క్రేన్లతో తొలగించిందని, ఆ పాపానికి శాపంగా టీడీపీ బతుకు 23 సీట్లకే పరిమితమైందన్నారు. వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అదే ప్రాంతంలో అద్భుతమైన విగ్రహాన్ని ఆవిష్కరించామని గుర్తుచేశారు.