అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఇర్వింగ్లోని నిమిట్జ్ హైస్కూల్లో పోలీసుల ప్రవర్తించిన తీరు విమర్శలకు తావిచ్చింది. క్యాంటీన్లో విద్యార్థుల మధ్య గత బుధవారం గొడవ జరిగింది. వారికి సర్ది చెప్పాల్సిన పోలీసులు దాడికి దిగారు. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా విచక్షణా రహితంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సదరు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.