బియ్యం కడిగిన నీటితో అద్భుత లాభాలున్నాయి. బియ్యం కడిగిన నీరు చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రైస్ వాటర్లో ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ రకాల పోషకాలు ఉండటం వల్ల అవి జుట్టు సంరక్షణ ,చర్మ సంరక్షణలో మంచి ఫలితాలను ఇస్తాయి. చర్మానికి పోషణ అందించడంతో పాటు మొటిమలు వంటి సమస్యలను బియ్యం కడిగిన నీరు దూరం చేస్తుంది.