పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రం విస్మరించిందని లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టుపై ఇతర రాష్ట్రాల బాధ్యతను ఒప్పించే బాధ్యతను కేంద్రం వదిలేసిందని గుర్తు చేశారు. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ ఘడ్లు కోర్టు చుట్టూ తిరగడానికి కేంద్రమే కారణమని చెప్పారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేయాలన్నారు.