దివంగత సీఎం ఎన్టీ రామారావు గురించి మాట్లాడే అర్హత బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబసభ్యులకెవరికీ లేదని వైసీపీ ఎమ్యల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఆనాడు చంద్రబాబుకు పార్టీ పగ్గాలు అప్పగించి, ఎన్టీఆర్ పై చెప్పులు విసిరితే ఆనందించారని ఫైరయ్యారు. బాలకృష్ణను చంద్రబాబు తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ మరణానికి నందమూరి కుటుంబసభ్యులు, చంద్రబాబే కారణమని ఆరోపించారు.