ఛత్తీస్గఢ్ దుర్గ్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. అమలేశ్వర్ గ్రామంలో అనంత్ సాన్వాని(40), సంగీత దంపతులకు కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. భార్యను నల్లగా ఉన్నావంటూ అనంత్ అవమానించే వాడు. పదే పదే హేళన చేసే వాడు ఇది తట్టుకోలేక భర్త మర్మాంగాన్ని సంగీత ఆదివారం కోసేసింది. ఆపై గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో అనంత్ చనిపోయాడు. సంగీతను పోలీసులు అరెస్ట్ చేశారు.