తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి. సుబ్బారెడ్డి, ఈవో ఎవి. ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డితో కలిసి ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు.