చిలకలూరిపేట పట్టణంలోని మదర్ థెరిసా కాలనీ సమీపంలోని పొలాల్లో ఇరువురు యువకులు మద్యం సేవించారు. మద్యం మత్తులో వారి మధ్య మాట మాట పెరిగి వివాదానికి దారితీసింది. దీనితో వారిలో ఒక యువకుడు మరో యువకుడి తల మీద బీరు సీసాతో కొట్టడంతో తల పగిలి రక్తం కారటంతో అతనిని చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు జి జి హెచ్ కు తరలించారు.