సామాజిక మాధ్యమాలలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలో పాస్ వర్డ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. బుధవారం బాపట్ల ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి పాస్ వర్డ్ మార్చుకొని రీసెట్ చేసే అలవాటు పెంచుకోవాలన్నారు. పాస్ వర్డ్ ని ఇతరులతో ఎప్పుడూ షేర్ చేయవద్దన్నారు. సైబర్ క్రైమ్ బారిన పడిన వాళ్ళు 1930 కు ఫోన్ చేయాలన్నారు.