దేశంలోని ప్రతి స్కూలులో దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక టీచర్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు విద్యాహక్కు చట్టం-2009కి సవరణలు చేసింది. 1-5వ తరగతి వరకు ప్రతి 10 మంది దివ్యాంగుల కోసం, 6 నుంచి 8వ తరగతికి అయితే ప్రతి 15 మంది కోసం ఒక టీచర్ ఉండాలంది. అయితే ఏకోపాధ్యాయులతో స్కూళ్లు నడుస్తున్నప్పుడు క్లస్టర్ గా గుర్తించి.. పిల్లల నిష్పత్తికి సరిపోయేలా టీచర్లను నియమించాలంది.