ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల ఎఫెక్ట్...అహ్మాదాబాద్ లో అంత‌ర్జాతీయ స్థాయి రైల్వే స్టేషన్

national |  Suryaa Desk  | Published : Wed, Sep 28, 2022, 11:05 PM

గుజ‌రాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకొంది. గుజరాత్ వాణిజ్య రాజ‌ధానిగా ప్ర‌సిద్ధికెక్కిన అహ్మాదాబాద్‌లో అంత‌ర్జాతీయ స్థాయి ప్రమాణాల‌తో ఓ రైల్వే స్టేష‌న్‌ను నిర్మించేందుకు కేంద్రం సూత్ర‌ప్రాయంగా నిర్ణ‌యించింది. వ‌ర‌ల్డ్ క్లాస్ వ‌స‌తుల‌తో అల‌రారుతున్న అంత‌ర్జాతీయ విమానాశ్రయాల్లో ఏ ఒక్క ఎయిర్ పోర్టుకు తీసిపోని విధంగా ఈ రైల్వే స్టేష‌న్‌ను తీర్చిదిద్దనున్న‌ట్లు స‌మాచారం. 


ఈ మేర‌కు అహ్మాదాబాద్‌లో నిర్మించ‌నున్న వ‌రల్డ్ క్లాస్ రైల్వే స్టేష‌న్ ఊహా చిత్రాల‌ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బుధ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు. త్వ‌ర‌లోనే అహ్మ‌దాబాద్ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానున్న ఈ రైల్వే స్టేష‌న్ వ‌స‌తుల విష‌యంలో ఏ ఒక్క అంత‌ర్జాతీయ విమానాశ్రయానికి తీసిపోద‌ని గోయ‌ల్ పేర్కొన్నారు. అహ్మ‌దాబాద్‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇస్తున్న మ‌రో బ‌హుమ‌తిగా ఈ రైల్వే స్టేష‌న్ నిల‌వ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com