నిత్యం వంటల్లో ఉపయోగించే కొత్తిమీర వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్-ఎ, సి, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర రసం తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణను పెంచుతుంది మరియు బీపీకి కారణమయ్యే సోడియంను బయటకు పంపుతుంది.