జాజికాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జాజికాయ పొడిని సూప్‌లలో కలిపి తీసుకుంటే, విరేచనాలు, మలబద్ధకం, గ్యాస్ మరియు ఇతర జీర్ణ సమస్యలు తగ్గుతాయి. జాజికాయ పొడిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఇది గుండె జబ్బులను నివారిస్తుంది.నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు రాత్రిపూట భోజనంలో జాజికాయ పొడిని తీసుకోవాలి. ఇలా చేస్తే రాత్రిపూట బాగా నిద్ర పడుతుంది.