కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. దసరా కానుకగా 78 రోజుల వేతనాన్ని బోనస్ గా ఇవ్వనున్నట్లు బుధవారం ప్రకటించింది. ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ కింద ఈ బోనస్ ను అందించనుంది. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు ఈ బోనస్ లభిస్తుంది. 11.56 లక్షల మంది ఉద్యోగులకు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం కలగనుంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వంపై రూ.2 వేల కోట్ల మేర భారం పడనుంది.