ఉత్తరాఖండ్ కి చెందిన విపిన్ కాంద్పాల్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. తర్వాత ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరారు. అయితే ఆయనకు కాలేయం దెబ్బతినడంతో అవయవ మార్పిడి చేయాలని డాక్టర్లు చెప్పారు. విపిన్ భార్య లివర్‌కు కొవ్వు అధికంగా ఉండటంతో కాలేయ మార్పిడి సాధ్యం కాలేదు. విపిన్ కుమారుడు బరువు తక్కువున్నాడు. దీంతో విపిన్ చిన్నకూతురు పాయల్ తన కాలేయంలోని 60% భాగాన్ని దానం చేసి, తండ్రి ప్రాణాలు కాపాడుకుంది.