తాడిపత్రి: పట్టణంలోని గాంధీ కట్ట వద్ద ఉన్న పాతకోట లో షేక్ అబ్దుల్ భాష, అయేషా లు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. షేక్ అబ్దుల్ బాషా లారీ క్లీనర్ గా పనిచేస్తూ ఉండేవారు. వీరికి వివాహమై ఐదు సంవత్సరాలు పూర్తయింది. నాలుగు సంవత్సరాల పాప, ఒకటిన్నర సంవత్సరం బాబు ఉన్నారు. షేక్ అబ్దుల్ బాషా మద్యానికి బానిసై భార్య అయేషాతో తరచూ గొడవ పడుతూ చిత్రహింసలకు గురి చేసేవాడు. భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక భార్య అయేషా గురువారం తెల్లవారుజామున నిద్రిస్తున్న భర్త అబ్దుల్ తలపై రోకల్ బండతో కొట్టి హత్య చేసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. విషయం తెలుసుకున్న తాడిపత్రి టౌన్ పోలీసులు అబ్దుల్ బాషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.