చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలను అన్ని గ్రామాల్లో వినియోగంలోకి తెచ్చే విధంగా ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని జెడ్పి సీఈవో శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. పొన్నూరు మండల పరిధిలోని పచ్చలతాడిపర్రు గ్రామంలోని డంపింగ్ యార్డ్ ను ఆయన పరిశీలించారు. డంపింగ్ యార్డుల్లో ఎరువులను తయారు చేసే యూనిట్ వినియోగంలోకి వస్తే పంచాయితీకి కూడా కొంతమేర ఆదాయం సమకూర్తుందన్నారు. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మారుతి శేషమాంబ, కార్యదర్శి రవిబాబు తదితరులు పాల్గొన్నారు.