వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుని చరిత్ర తిరగరాస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలిచి తీరుతామని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. చరిత్ర తిరగరాస్తాం..మాది అతి విశ్వాసం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి పనికిమాలిన ప్రతిపక్షం అవసరమా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రానికి టీడీపీ అవసరం లేదని తెలిపారు. కొన్ని పత్రికలు తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.