టీ20 వరల్డ్ కప్ కి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. జట్టులో ప్రధాన బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా టీ20 వరల్డ్ కప్ దూరం కానున్నట్లు సమాచారం. వెన్నులో ఫ్రాక్చర్ గాయంతో బుమ్రా వరల్డ్ టీ20కి దూరమైనట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. 4 నుంచి 6 నెలలు బుమ్రాకి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఒకవేళ బుమ్రా ఆడకపోతే టీమిండియా బౌలింగ్ బలహీనంగా మారనుంది.