ఏపీలో టీడీపీ హయాంలో ఉద్యోగులపై నమోదైన ఏసీబీ కేసులను పునర్ సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఆదాయాన్ని మించి ఆస్తులకు సంబంధించి కొందరు ఉద్యోగులపై గత ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా కేసులు నమోదు చేసిందంటూ విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ట్రాప్ కేసులు మినహా మిగిలిన కేసులను కమిటీ సమీక్ష చేయనుంది.