వరకట్న వేధింపులకు గృహిణి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. తనతో పాటు అక్షిత (1) సంవత్సరం పసికందు కు విషం తాగించింది . ఈమేరకు ఎంవీపీ పోలీసుస్టేషన్ పరిధిలో గల కృష్ణా కాలేజ్ ప్రాంతానికి చెందిన సంపంగి శైలజ (34), పురుగుల మందు తాగి తన కుమార్తెకు పురుగుల మందు తాగించింది. విషయం తెలుసుకున్న స్థానికులు వారికి చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. భర్త మోహన్, అత్త వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ లెటర్ రాసినట్లు సమాచారం. భర్త మోహన్ ఓ ప్రయివేటు బ్యాంకులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.