గుంటూరు: వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని పత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుచరిత మాట్లాడుతూ ప్రజల ముంగిటికే పరిపాలన తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు వేగవంతంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు.