కృష్ణా, నందిగామ: కంచికచర్ల మండలం పరిటాల బైపాస్ రోడ్డు లో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఒక మహిళకు గాయాలు తగిలాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న రెండు కార్లు. ఒక కారు మరొకరుని బలంగా ఢీకొట్టడంతో రహదారికి అడ్డంగా తిరిగిన కారు. హైదరాబాదు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఇద్దరు దంపతులకు పాటు రెండు సంవత్సరాల పసిపాప, హైదరాబాదు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న డ్రైవర్ తో పాటు ప్రయాణిస్తున్న మహిళ ఉన్నారు. రెండు కారులలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సీటు బెల్టు పెట్టుకోవడంతో తప్పిన పెను ప్రమాదం. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపిన పోలీసులు. ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా క్రేన్ సాయంతో చర్యలు చేపట్టిన పోలీస్ మరియు హైవే సిబ్బంది. సంఘటన చూసి చలించి భార్యతో కలిసి విజయవాడ వైపు వెళ్తున్న కానిస్టేబుల్ డేవిడ్ 108 సిబ్బందికి సమాచారం అందించి ప్రధమ చికిత్స అందే విధంగా చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుల్ డేవిడ్ కి కృతజ్ఞతలు తెలిపిన ప్రయాణికులు.