కొత్తిమీర తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- కొత్తిమీర తినడం వల్ల బీపీ తగ్గుతుంది.
- రక్తంలోని చక్కెరస్థాయులను తగ్గించడంలో కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తుంది.
ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా పెంచడంలో సహాయపడుతుంది.
- కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి శరీరకణాలను కాపాడుతాయి.
- కొత్తిమీరలో ఎలోమోల్, కాంఫార్, బొర్నెవోల్,కార్వోన్, క్వుర్సేటివ్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతీయకుండా కాపాడతాయి.
- కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వును తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వును పెంచుతుంది. అధిక రక్తపోటును కంట్రోల్‌లో ఉంచడంతో పాటు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడం వల్ల హృద్రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
- వయసు పెరుగుతున్న కొద్దీ పార్కిన్సన్, ఆల్జీమర్స్ వంటి వ్యాధులు మెదడు పనితీరును దెబ్బతీస్తుంటాయి. కొత్తిమీరలోని యాంటీ ఆక్సిడెంట్లు మనలోని యాంగ్జైటీని తగ్గిస్తాయి. అలాగే నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
- కొత్తిమీరను ప్రతిరోజు తింటే పేగులు శుభ్రమవుతాయి. దీంతో జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు కొత్తిమీరను రోజూ తినడం మంచిది.
- కొత్తిమీరలో యాంటీమైక్రోబయాల్ కాంపౌండ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆహార కల్తీ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. కొత్తిమీరలోని డోడెసెనాల్ అనే పదార్థం బ్యాక్టీరియాలతో పోరాడుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ నుంచి మనల్ని రక్షిస్తుంది.
- చర్మంపై దద్దుర్లు, మొటిమలు, గాయాల మచ్చల నివారణకు కొత్తిమీరలోని యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో మేలు చేస్తాయి.
- కొత్తిమీరలో ఉండే విటమిన్ ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫాస్పరస్‌లు దృష్టిలోపాలను నియంత్రిస్తాయి. కొత్తిమీర తినడం వల్ల కంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
- కొత్తిమీరలో ఉండే కాల్షియం, ఇతర మినరల్స్ ఎముకలను బలంగా చేస్తాయి. ఎముకల పెరుగుదలకు దోహదం చేస్తాయి.