ప్రయాణీకుల మన్ననలను పొందేలా ఆర్ టి సి అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రయాణీకుల సౌకర్యార్థం రాయచోటి బస్ స్టాండ్ లో శుక్రవారం ఐదు నూతన బస్ సర్వీసులను ప్రజాప్రతినిధులు, అధికారులుతో కలసి ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టిసి ప్రయాణీకులకు బుస్సులలోనూ, బస్ స్టాండ్ లలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.