తంబళ్లపల్లె నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తంబళ్లపల్లె పంచాయతీలోని పల్లెల్లో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల లబ్ధి పై ఆరా తీశారు. ఇంకా ఉన్న అర్హులకు పథకాలు అందకుంటే న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, అధికారులను ఆదేశించారు.