సోమల మండలం నంజంపేట పంచాయతీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం జరిగింది. అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు సమస్యల పరిష్కారమే కార్యక్రమం ఉద్దేశం అని నాయకులు తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి పీఏ మురళీకృష్ణా రెడ్డి, ఎంపీపీ ఈశ్వరయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్లు అమాస మోహన్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.