పొన్నూరు పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య చేతుల మీదగా దివ్యాంగులకు బస్సు పాసులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల నాయకులు నూర్ భాషా అల్లా బక్షు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో దివ్యాంగులకు బస్సు పాసు 3 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయడం జరుగుతుంది అని కొనియాడారు. అలానే దివ్యాంగులకు జగనన్న ప్రభుత్వంలో వాలంటీర్లు ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగిందన్నారు. అలానే దివ్యాంగులు ఎమ్మెల్యే రోశయ్య కు దివ్యాంగులు కొన్ని సమస్యలను వారికి వివరించడం జరిగింది. ఎమ్మెల్యే రోశయ్య మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల నాయకుడు నూర్భాష అల్లా బక్షు, కాట్రగడ్డ విజయకుమార్, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.