ఆర్యవైశ్యులు ఆర్థికంగా ఎదిగి, రాజకీయాలలో రాణించాలని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి సాదు ప్రతాప్ పిలుపునిచ్చారు. ధర్మవరంలో ని వాసవీ కళ్యాణమండపంలో జరిగిన ఆర్యవైశ్య సంఘం ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోన వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం నిత్యావసర సరుకులకు ఇబ్బందులు కలగకుండా ఆర్య వైశ్యులు ఎంతో ధైర్యంగా తమ వ్యాపారాలను కొనసాగించారని అన్నారు. లేకుంటే ఆకలి చావులు వుండేవన్నారు.