గుత్తి పట్టణంలోని బేడ బుడగ జంగాల కాలనీకి చెందిన మౌనిక అనే మహిళను ఆమె భర్త మోసం చేశాడని తగిన న్యాయం చేయాలని ఓసిసిఐ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి. లక్ష్మీదేవి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా సంఘం నాయకురాళ్లు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు బాధితురాలి ఇంటికి వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. తన భర్త రెండో వివాహం చేసుకుని అత్త తోపాటు తనను శారీరకంగా, మాన సికంగా హింసిస్తున్నారని తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంద ర్భంగా ఓసిసిఐ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి. లక్ష్మీదేవి మాట్లాడు తూ బాధిత మహిళకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని అన్నారు.