గుంతకల్లు పట్టణ ప్రజలకు తాగు నీరు సరఫరా చేసే నీటి శుద్ది కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న శనివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సమ్మర్ స్టోరేజిలో నీటి నిల్వను, శుద్ది కేంద్రంలో ఫిల్టర్ బెడ్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిం చాలని ఏఈ షాబనాను ఆదేశిం చారు. నీరు శుద్ది చేయడంలో నిర్లక్ష్యం చేయరాదని, క్లోరనేషన్ తగినంత మోతాదులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన తోపాటు డిఈఈ హేమచంద్ర కుమార్ ఉన్నారు.