గ్యాస్ సిలిండర్లు వినియోగించే వారికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఇకపై డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల వినియోగంపై కేంద్రం పరిమితి విధించింది. వినియోగదారులు సంవత్సరంలో 15, నెలలో 2 సిలిండర్లను మాత్రమే వాడాల్సి ఉంటుంది. అంతకుమించి కొనుగోలు చేస్తే సబ్సిడీ లభించదని కేంద్రం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. దేశీయ నాన్-సబ్సిడీ కనెక్షన్ హోల్డర్లు ఇప్పటివరకు తమకు ఇష్టం వచ్చినన్ని రీఫిల్స్ బుక్ చేసుకోవచ్చు. కానీ వినియోగదారులు సిలిండర్లను దుర్వినియోగం చేస్తున్నారని సరఫరాదారుల నుంచి పలు ఫిర్యాదుల వచ్చిన నేపధ్యంలో ఎల్పీజీ సంస్థ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
మరోవైపు కొత్త చట్టం ప్రకారం, సబ్సిడీ డొమెస్టిక్ గ్యాస్ కింద నమోదు చేసుకున్న వారికి సంవత్సరానికి పన్నెండు సిలిండర్లు మాత్రమే. ఒకవేళ అదనంగా సిలిండర్ల అవసరం ఉన్నట్లయితే.. వారు కచ్చితంగా సబ్సిడీ లేని సిలిండర్లను తీసుకోవాల్సి ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ల ప్రకారం, ఒక కనెక్షన్ కింద ఒక నెలలో రెండు సిలిండర్లు మాత్రమే తీసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాప్ లిమిట్ దాటకూడదు.