శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం లో జి ఎం ఎస్ గ్యాలరీ ప్రొడక్షన్ నెంబర్. 6 ఇండిపెండెంట్ చలన చిత్రం నిర్మాణం పూజా కార్యక్రమాలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ చిత్ర నిర్మాణ పూజా కార్యక్రమం తరువాత బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కేంద్ర సెన్సార్ బోర్డ్ సభ్యులు జి. యం శేఖర్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ చిత్ర నిర్మాత జి ఎం ఎస్ గ్యాలరీ ఎం. డి. జీ యం సురేష్ , చిత్ర దర్శకులు సందీప్ చౌహాన్ చిత్ర కళాకారులు, వివిధ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.