వయసు పెరిగే కొద్దీ ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అయితే సరైన పోషకాహారం, రోజూ వ్యాయామం చేస్తే వృద్ధాప్యం దరిచేరదు. ముఖ్యంగా వృద్ధాప్యాన్ని రాకుండా అడ్డుకోవడంలో అవిసె గింజలు అద్భుతంగా పని చేస్తాయి. ఇందులో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ దీర్ఘాయువును అందిస్తాయి. రోజూ గుప్పెడు అవిసె గింజలు తింటే స్థూలకాయం, మధుమేహం రావు. కిడ్నీ, గుండెపోటు, కేన్సర్ రాకుండా సహాయపడుతాయి.