రైళ్లలో ప్రయాణించేవారికి రైల్వే కొత్త రూల్ ను తీసుకొచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రూల్ ను తీసుకొచ్చినట్లు రైల్వే తెలిపింది. కొత్త రూల్ ప్రకారంగా ప్రయాణికులు రాత్రి వేళల్లో పాటలు వినకూడదు, శబ్దాలు చేయకూడదు. అలాగే బిగ్గరగా అరవకూడదు. ఇలాంటివి చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే వారిపై చర్యలు తీసుకోనుంది. జరిమానా విధించే అవకాశం ఉందని రైల్వే తెలిపింది.