ఆంధ్రప్రదేశ్ ను గంజాయికి అడ్డాగా మార్చారని తెలుగుదేశం స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అన్నారు. శుక్రవారం నందలూరులో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు దేశం మొత్తానికి బియ్యం ఎగుమతి చేస్తూ అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ నేడు జగన్ రెడ్డి పరిపాలనలో దేశం మొత్తానికి గంజాయి సరఫరా చేస్తూ గంజాయాంధ్రప్రదేశ్ గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా జరగడం మన దురదృష్టం అని అన్నారు.