విశాఖ ఐటీ ప్రొఫెషనల్స్‌కు శుభవార్త. ఇన్ఫోసిస్ కార్యకలాపాలు నేటి నుంచి ప్రారంభం కానున్నా యి. ఇకపై సాఫ్ట్‌వేర్ నిపుణులకు మంచి అవకా శాలు లభించనున్నాయి. ఐటీ హబ్‌గా విశాఖ పట్నం వడివడిగా అడుగులు వేస్తోంది. వైజాగ్ లో బీచ్ ఐటీని ప్రమోట్ చేస్తూ దావోస్ పర్యటన లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పంచుకున్న ఆలోచనలకు ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఫిదా అయ్యింది. విశాఖ నుంచి తమ సంస్థ కార్యకలాపాల్ని ప్రారంభించేందు కు ఉపక్రమించింది. శనివారం సుమారు వెయ్యి మందికి ఉద్యోగులతో నేటి కార్యకలాపాలు ప్రారంభించనుంది.
కోయంబత్తూరు. కోల్‌కతా, నోయిడా, వైజాగ్. టైర్-2 నగరాల్లో కొత్త ఆఫీసులను ఇన్ఫోసెస్ ప్రారంభించింది. ఇన్నాళ్లు ఎప్పుడెప్పు డా అని ఎదురు చూసిన విశాఖ ఐటీ రంగ అభి వృద్ధి మహర్ధశ పట్టింది. వెయ్యి చదరపు అడుగులు, వెయ్యి మంది ఉద్యోగులతో ఇన్ఫో సిస్ కార్యకలాపాలు నేటి నుంచి విశాఖ వేదికగా ప్రారంభం కానున్నాయి. ప్రముఖ కంపె నీలు ప్రస్తుతం విశాఖవైపు దృష్టి సారిస్తున్నాయి. దీంతో విశాఖకు ఐటీ కళ ప్రారంభం కానుంది. మధురవాడ ఐటీ సెజ్‌లోని మహితి సొల్యూషన్స్ ప్రాంగణంలో తొలుత వెయ్యిమంది ఉద్యోగుల తో మొదలుపెట్టి క్రమంగా 3వేల మంది ఉద్యోగులకు విస్తరించాలన్నదే ఇన్ఫోసిస్ లక్ష్యం. ఈమేరకు ప్రభుత్వానికి ప్రాజెక్టు కూడా సమర్పిం చింది. మరో ప్రముఖ కంపెనీ డల్లాస్ టెక్నాలజీ కూడా ఆఫీసు తెరిచే ఛాన్స్ ఉంది.
దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో పెట్టు బడులు పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ప్రత్యేకంగా విశాఖపట్నం కేంద్రంగా ఐటీ, ఐటీ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని వివరించారు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ)తో పాటు ఇన్ఫోసిస్, డబ్ల్యూఈఎఫ్ హెల్త్‌కేర్‌తో పాటు ఇన్ఫోసిస్, ఐబీఎం, హెచ్‌సీఎల్ మొదలైన ఐటీ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. సముద్రం వ్యూ కనిపించేలా. ప్రశాంతమైన వాతావరణంలో పనిచేస్తే అద్భుత ఫలితాలు రాబట్టుకునేలా వైజాగ్ బీచ్–ఐటీ కాన్సెప్ట్ గురిం చి ఏపీ పెవిలియన్‌లో ఎక్కువగా ప్రమోట్ చేశారు. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో తమ సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది.
టైర్–2 సిటీల్లో వైజాగ్ ది బెస్ట్ ఇటీవల కాలంలో ఐటీ రంగంలోకి ద్వితీయ శ్రేణి నగరాల నుంచి చాలా మంది రిక్రూట్ అయ్యారు. టాలెంట్ పూల్‌కి దగ్గరగా. ప్రతిభను ఆకర్షించేలా టైర్–2 నగరాలకు కార్యకలాపాలు విస్తరించాలని ఇన్ఫోసిస్ నిర్ణయించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పాలసీతో పాటు బీచ్ ఐటీని ప్రమోట్ చేయడం తో వైజాగ్‌లో సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేసింది. దేశంలో ఉన్న ద్వితీయ శ్రేణి నగరాల్లో అన్ని వసతులు, వనరులున్న విశాఖ ది బెస్ట్ సిటీగా ఉండ టంతో. ప్రముఖ సంస్థలు ఇటువైపుగా తమ కార్యకలాపాలు విస్తరించేందుకు అడుగులు వేస్తున్నాయి.