రాష్ట్రంలో ప్రతి ఇంట సంక్షేమ పథకాల వెల్లువ కనిపిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యుడు సామినేని ఉదయభాను అన్నారు. జగ్గయ్యపేట రూరల్ మండలం వేదాద్రి గ్రామంలో శనివారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లిన సుమారు రెండు లక్షల రూపాయలకు పైగా లబ్ధి పొందిన వారు ఉన్నారని, సొంత ఇల్లు లేని వారికి స్థలాన్ని కేటాయించడం జరిగింది అని అన్నారు, దేశంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 98% హామీలను పూర్తిచేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని తెలిపారు.
అదే విధంగా వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొక అడుగు ముందుకు వేశారని దీని ద్వారా పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాలను నివారించడం మాత్రమే కాదు, పాఠశాలల్లో చేరికల శాతాన్ని పెంచడం జరుగుతుంది తెలిపారు, గత ప్రభుత్వంతో పోలిస్తే, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అర్హులకు ఆర్థిక సాయం భారీగా పెంచారు అని అన్నారు, అర్హుల ఎవరైనా ఉంటే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కెడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ గుడారు పెరయ్య, జగ్గయ్యపేట యువజన విభాగం అధ్యక్షులు ఆవాల భవాని ప్రసాద్, ఎస్టీ సెల్ నాయకులు బద్దు నాయక్ , మండల పార్ట్ అధ్యక్షుడు చిలుకూరు శ్రీనివాస్, సొసైటీ అధ్యక్షులు తుమాటి నాగేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆనంగి శ్రీనివాస్, మండల యూత్ ప్రెసిడెంట్ పోతుమర్తి స్వామి యాదవ్, ex జడ్పిటిసి చల్లా వైకుంఠరావు, మండల ప్రధాన కార్యదర్శి మువ్వ రాము, మండల బీసీ సెల్ నాయకులు జువ్వాజి నరసింహరావు, రామారావు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.